A2 న్యూస్, జూన్ 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి, వారి వద్ద నుంచి గంజాయి, వాహనం, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మెదక్ పట్టణానికి చెందిన కేంద్రే నిఖిల్, చింతకుంట ప్రేమ్‌కుమార్ అనే వ్యక్తులు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్కన్నపేట రైల్వే గేట్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో వారి వద్ద నుంచి 140 గ్రాముల గంజాయితో పాటు ఒక హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కేసును ఛేదించడంలో రామాయంపేట ఇన్‌స్పెక్టర్ నరేందర్, మెదక్ డీటీఎఫ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్, రామాయంపేట ఎస్‌ఐ హరీష్, మెదక్ డీటీఎఫ్ సిబ్బంది బాలయ్య, రామాయంపేట ట్రైనీ ఎస్‌ఐ ఎం.డి. షరీఫ్‌లు కీలక పాత్ర పోషించారు.