A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 8:01 am Posted by : A2TV NEWS

గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 6:

మెదక్ (5) జిల్లాలో ఈ నెల 6న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామాయంపేట–సిద్దిపేట మధ్య ఎన్ హెచ్ -765 డి జి వెంట దేశంలోనే తొలిసారిగా 35 వేల జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు ఐడీఓసీలో నషా ముక్త్ భారత్ ర్యాలీని ప్రారంభించి, విద్యార్థులతో ముఖాముఖి, మహిళా శక్తి స్టాళ్ల సందర్శన, రెడ్‌క్రాస్ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం రామాయంపేటలో సాయంత్రం 3.30 గంటలకు భారీ జీడిమామిడి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గవర్నర్ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. పటిష్ఠ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.