జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

మెదక్ జిల్లాలో 1.81 లక్షల మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, జులై 13, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (12) జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (నేషనల్ డీ-వార్మింగ్ డే) కార్యక్రమానికి మెదక్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 1,81,425 మంది పిల్లలను గుర్తించగా, వారికి పంపిణీ చేసేందుకు 2,36,400 అల్బెండజోల్ మాత్రలను సిద్ధంగా ఉంచినట్లు...