A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 7:20 am Posted by : A2TV NEWS

కాడాస్ట్రల్ రీ-సర్వేకు పకడ్బందీ చర్యలు

10 గ్రామాల్లో 13 వేల ఎకరాల రీ-సర్వే పూర్తి — నిర్దేశిత గడువులో ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 12:

మెదక్ జిల్లా(11) జిల్లాలో కొనసాగుతున్న కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్, మెదక్ ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, తూప్రాన్ ఆర్డీవో బావయ్య, సంబంధిత తహసీల్దార్లు, సర్వేయర్లతో కలిసి కాడాస్ట్రల్ రీ-సర్వే పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 10 గ్రామాల్లో సుమారు 13 వేల ఎకరాల రీ-సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. సర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.సర్వే బృందాల రోజువారీ పనితీరు, ప్రతి బృందం సాధిస్తున్న పురోగతి, రోజుకు పూర్తవుతున్న విస్తీర్ణం తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాడాస్ట్రల్ రీ-సర్వే ద్వారా భూ రికార్డులను శాస్త్రీయంగా, పారదర్శకంగా రూపొందించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపేలా సర్వే వివరాలు అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంబంధిత తహసీల్దార్లు, సర్వే అధికారులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.