A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 6:24 am Posted by : A2TV NEWS

సూరారం శివారులో పేకాట స్థావరంపై దాడి

10,380 నగదు, పేకముక్కలు స్వాధీనం – ఐదుగురు అదుపులో

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 6:

శంకరంపేట(ఆర్) (5) మండలంలోని సూరారం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పేకాట ఆడుతున్న రణబోయిన విఠల్, ఉప్పరి గంగాధర్, బక్కన్న నర్సింలు, ఆమ్దా నాగరాజు, యాట దర్శన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వారి వద్ద నుంచి పేకాటకు వినియోగిస్తున్న 10,380 నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. పేకాట స్థావరాల నిర్వహణపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.