అధికారాల దుర్వినియోగం ఆరోపణలు.. పోలంపల్లి సర్పంచ్ ఆరు నెలల పాటు సస్పెన్షన్
A2న్యూస్, జులై 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) చేగుంట (10) మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి కొండి రాజ్యలక్ష్మిని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 37(1)(ii), (iii), (iv) మరియు సెక్షన్ 37(5) ప్రకారం ఆరు నెలల పాటు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, తూప్రాన్ డివిజనల్ పంచాయతీ అధికారి సమర్పించిన విచారణ నివేదికలో గ్రామపంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో నాటిన...