జూలై 31లోపు రేషన్ కార్డుదారులందరూ ఈ-కేవైసీ పూర్తి చేయాలి: జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్
A2న్యూస్, జులై 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్(17) జిల్లాలోని అర్హులైన రేషన్ కార్డుదారులందరూ ఈ నెల జూలై 31, 2026 లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. పౌర సరఫరాల కమిషనర్ ( సి సి ఎస్) ఆదేశాల మేరకు, భారత ప్రభుత్వానికి(జి ఓ ఎల్ ) ఈ-కేవైసీ వివరాలను నవీకరించాల్సి ఉన్నందున జిల్లాలో ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల...