పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలి అదనపు జిల్లా కలెక్టర్ నాగేష్
A2న్యూస్, జులై 11, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) నర్సాపూర్ (10) గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ సర్పంచ్ లకు సూచించారు. శుక్రవారం బీవీఆర్‌ఐటీ కళాశాలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన సర్పంచ్ లను ఉద్దేశించి మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టడం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచవచ్చని పేర్కొన్నారు....