ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం చర్యలు
బాధితులకు సత్వర న్యాయం అందించాలి: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 18: మెదక్ జిల్లా (17) ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు, భూ...