A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 4:53 am Posted by : A2TV NEWS

సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యకర సమాజం

A2న్యూస్,  హవేలీఘన్పూర్ ప్రతినిధి (ఆకుల యాదగిరి) అక్టోబర్ 1:

హవేలీఘన్పూర్ (30) మెదక్ జిల్లా హవేలీఘన్పూర్ మండలం తొగిట గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (ఎఫ్‌పీఓ) వార్షిక సర్వసభ సమావేశం అధ్యక్షుడు నాయి కోటి శ్యామ్‌సుందర్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్, జిల్లా సొసైటీ అధికారి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవ్‌కుమార్ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో వివిధ పంటలను సాగు చేయాలని సూచించారు. ఎఫ్‌పీఓకు వ్యవసాయ శాఖ నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 2021లో కేవలం 10 మంది సభ్యులతో ప్రారంభమైన ఎఫ్‌పీఓ ప్రస్తుతం 315 మంది సభ్యులకు చేరడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతులు వరి పంటతో పాటు ఇతర పంటలను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని వక్తలు సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రసాయన ఎరువుల అధిక వినియోగంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, పశుపోషణతో పాటు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి బాల్‌రెడ్డి, సర్పంచ్ సౌమ్య శశికాంత్, ఉపసర్పంచ్ కవిత రామ్‌కుమార్ యాదవ్, ఎఫ్‌పీఓ ఉపాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మాజీ మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్యరెడ్డి, ఎఫ్‌పీఓ డైరెక్టర్లు, సర్పంచులు, రైతులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.