A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 19:
నర్సాపూర్ (18) నర్సాపూర్‌లోని మాతాజీ హార్డ్‌వేర్ గోదాంలో షాక్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరగగా, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం పట్టణంలోనినర్సాపూర్–సంగారెడ్డి ప్రధాన రహదారి పక్కన ఉన్న మాతాజీ హార్డ్‌వేర్ గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన మంటలతో పాటు పొగలు వెలువడటంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా మరి ఏదైనా ఉందా అనే కోణంలో అధికారులుపరిశీలిస్తున్నారు.