సాయంత్రం 5 గంటలకు మండల కేంద్రానికి చేరుకోనున్న కమిషన్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 16:
మెదక్ జిల్లా (15) లోది కులానికి చెందిన వారి సమస్యలను అధ్యయనం చేసేందుకు బీసీ కమిషన్ ఈ నెల 16న మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని కమిటీ సాయంత్రం 5 గంటలకు పెద్ద శంకరంపేట మండల కేంద్రానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా లోది కులానికి చెందిన ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, వాటిపై కమిషన్ అధ్యయనం చేయనుంది. లోది కులానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలు, అభ్యర్థనలు మరియు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషన్ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అలాగే జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై బీసీ కమిషన్ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు.

