A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 8:
మెదక్ జిల్లా ( 7) అర్ధ వార్షిక తనిఖీ షెడ్యూల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన ఈ తనిఖీలో గోదాంలో భద్రపరిచిన ఈవీఎంల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. గోదాం వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, ప్రవేశ నియంత్రణ చర్యలు, భద్రతా ప్రమాణాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే సంబంధిత రికార్డుల నిర్వహణ తీరును పర్యవేక్షించారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా భారత ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో ఎన్నికల సూపరెండెంట్ గఫర్, విభాగాధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

