మెదక్‌లో 99% ఎస్‌ఐఆర్ పూర్తి – 278 మంది బీఎల్‌ఏలకు 14 లక్షల ప్రోత్సాహక నగదు అందజేసిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 29: మెదక్ జిల్లా (28) మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం 99 శాతం పూర్తయిందని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. ఈ విజయానికి కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, గ్రామస్థాయి కార్యకర్తలు, స్థానిక నాయకత్వం సమిష్టిగా చేసిన కృషే కారణమని ఆయన పేర్కొన్నారు. మెదక్ పట్టణంలోని మంజీరా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అధ్యక్షతన ఎస్‌ఐఆర్ కార్యక్రమ పురోగతిపై సమీక్ష సమావేశం...