బొమ్మా బొరుసు ఆడుతున్న 9 మంది అరెస్టు 7,910 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం – మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2: మెదక్ జిల్లా (1)మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలోని కల్లు దుకాణం వెనుకవైపు బొమ్మా బొరుసు ఆడుతున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 7,910 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో శేఖర్, యాదగిరి, చంద్రశేఖర్, ప్రవీణ్, చంద్రం, కిష్టయ్య, పోలె లక్ష్మణ్, దుర్గేష్, నిఖిల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు...