A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 6:17 am Posted by : A2TV NEWS

పులిమామిడిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 16:

చేగుంట (15) మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పులిమామిడి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ మద్దూర్ రాజు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంగలి లక్ష్మణ్, మద్దూరి రాజు, అబ్రమైన యశోద, గొర్రె శ్రీహరి, గొర్రె ఎల్లవ్వ, బండ్ల వేణు, తోయేటి రాధాకృష్ణ, కొమ్ము కవితతో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాకు వందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు. గ్రామపంచాయతీ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.