A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 10:
నర్సాపూర్ (9) డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ కార్మికులు ఆదివారం ఉదయం 2కె రన్ కార్యక్రమం చేపట్టారు. సిఐటియు జిల్లా నాయకులు కడారి నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కడారి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఆలంబిస్తుందని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 10న జైల్ భరో కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాములు, పుష్ప, మున్సిపల్ జవాన్లు ఎల్లం, అశోక్, జనార్ధన్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.