విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రతీక ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ జిల్లా ప్రతినిధి(రాము) మెదక్, జూన్ 14: విద్యార్థినీ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రతీకలుగా నిలుస్తున్నాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యా శాఖ సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేసి పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సోమవారం నుంచి మొత్తం 1,037 పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయని, అందులో 928 ప్రభుత్వ పాఠశాలలు, 109 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో...