గత సంవత్సరం కంటే మెరుగ్గా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరిన ధాన్యం కొనుగోళ్లు – కలెక్టర్ ప్రతిమా సింగ్
చివరి దశకు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియ గత సంవత్సరం కంటే మరింత సమర్థవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని పేర్కొన్నారు.జిల్లాలో ఏర్పాటు చేసిన మొత్తం 415 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తిచేసి ముగించడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు 90,669 మంది రైతుల నుంచి 4,01,033.440 మెట్రిక్...